రూ.2.26 లక్షల కోట్ల నిధులు మళ్లింపు.. మరణశిక్ష | Vietnam 27 Billion USD Banking Scandal Real Estate Tycoon Asset Auction | Sakshi
Sakshi News home page

రూ.2.26 లక్షల కోట్ల నిధులు మళ్లింపు.. మరణశిక్ష

Mar 24 2026 2:03 PM | Updated on Mar 24 2026 2:08 PM

Vietnam 27 Billion USD Banking Scandal Real Estate Tycoon Asset Auction

ట్రూంగ్ మై లాన్ ఆస్తుల వేలం!

ఆసియా బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడి, మరణశిక్ష పడిన వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజం ట్రూంగ్ మై లాన్(69) ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్ (ఎస్‌సీబీ) నుంచి ఆమె కొల్లగొట్టిన సుమారు 27 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.26 లక్షల కోట్లు) నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ భారీ వేలం ప్రక్రియను చేపడుతున్నారు.

వేలం జాబితాలో ఏమేమున్నాయి?

వియత్నాం సివిల్ జడ్జిమెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన వివరాల ప్రకారం, విలాసవంతమైన భవనాల నుంచి చిన్నపాటి వస్తువుల వరకు వేలంలో ఉంచనున్నారు. హో చి మిన్ సిటీలోని ఖరీదైన ఆఫీస్ స్పేస్‌లు, టే నిన్ ప్రావిన్స్‌లోని భారీ ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ హెర్మేస్ బిర్కిన్ హ్యాండ్‌బ్యాగులు, 8,500 కంటే ఎక్కువ డిజైనర్ దుస్తులు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వేలం వేయనున్నారు. ఒక లగ్జరీ కారు, రెండు ట్రక్కులు, భారీ యంత్రాలతో పాటు లాన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన ‘రెవరీ సాయిగాన్’ యాచ్ (విహార నౌక) ఉంది. లగ్జరీ ఫర్నీచర్ కంపెనీకి చెందిన సుమారు 3,70,000 ఇన్వెంటరీ వస్తువులను కూడా ఈ వేలంలో విక్రయించనున్నారు.

కేసు నేపథ్యం ఏమిటి?

వియత్నాం రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఉన్న ట్రూంగ్ మై లాన్ సాయిగాన్ కమర్షియల్ బ్యాంక్‌లోని నిధులను దశాబ్ద కాలం పాటు అక్రమంగా మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 2024లో బ్యాంక్ నుంచి 12.3 బిలియన్ డాలర్లను మళ్లించినందుకుగాను కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. మనీ లాండరింగ్, ఇతర ఆర్థిక నేరాల కింద రెండో దఫా విచారణలోనూ ఆమెను దోషిగా నిర్ధారించారు. ఆమె చేసిన కుంభకోణం వల్ల కలిగిన మొత్తం నష్టం 27 బిలియన్ డాలర్లుగా తేల్చారు. దీన్ని రికవరీ చేసేందుకు ఆమె వ్యక్తిగత ఆస్తులతో పాటు కంపెనీ ఆస్తులను జప్తు చేశారు.

ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement