ఒక్కసారి ఈ సైకిల్‌ చూస్తే... కొనకుండా ఉండలేరు

Veloretti Vintage Style Electric Bikes Now Start Mass Production - Sakshi

ఇప్పుడిప్పుడే ఇండియాలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌ ఊపందుకుంటోంది. మార్కెట్‌లోకి కొత్తగా ఈవీ కార్లు, బైకులు, స్కూటర్లను కంపెనీలు ప్రవేశపెడుత్నున్నాయి. మరోవైపు వెస్ట్రన్‌ కంట్రీలు మరో అడుగు ముందుకు వేసి వింటేజ్‌ లుక్‌తో ఎలక్ట్రికల్‌ సైకిళ్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఈ మోడ్రన్‌  సైకిల్స్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

ఐవీ, ఏస్‌
ఇటలీకి చెంది వెలోరెటి కొత్తగా ఐవీ, ఏస్‌ పేర్లతో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్‌లోకి తెస్తోంది. పూర్తిగా వింటేజ్‌ లుక్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి. ఐవీ, ఏస్‌ల మోడళ్లను ఒకే టెక్నాలజీతో రూపొందించారు. కేవలం ఫ్రేమ్స్‌ తేడా చూపించారు. ఈ  సైకిళ్లలో 510 Wh బ్యాటరీలను అమర్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేసే 60 నుంచి 120 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయోచ్చు. హైడ్రాలిక్‌ బ్రేక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ ఫ్రంట్‌, బ్యాక్‌ లైట్లను అమర్చారు. ఆటోమేటిక్‌ గేర్‌ షిఫ్ట్‌ సిస్టమ్‌తో ఈ సైకిళ్లు రూపొందాయి.

ఫుల్‌ క్రేజ్‌
వింటేజ్‌ లుక్‌తో లేటెస్ట్‌ టెక్నాలజీ మిక్స్‌ చేసి వాలోరెటీ రూపొందించిన  ఐవీ, ఏస్‌ మోడళ్లకు  యూరప్‌లో క్రేజ్‌ ఏర్పడింది. దీంతో భారీ ఎత్తున సైకిళ్లు తయారు చేసే పనిలో ఉంది వెలోరెటి. యూరప్‌లో ఎక్కడికికైనా సరే పది రోజుల్లో డెలివరీ ఇస్తామంటూ హామీ ఇస్తోంది. ఈ సైకిల్‌ ‍ క్రేజ్‌ చూసిన తర్వాత .. త్వరలోనే మన దగ్గర కూడా ఇలాంటి సైకిళ్లు వస్తే బాగుండు అనుకుంటున్నారు నెటిజన్లు. 
 

చదవండి : సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top