నగరంలో అల్ట్రా లగ్జరీ గృహాలు

Ultra luxury homes in the hyderabad and seven states - Sakshi

హైదరాబాద్‌తో సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ గృహాలు ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది క్యూ1 నాటికి 42,080, 2020 క్యూ1లో 41,750 యూనిట్లుగా ఉన్నాయి. కరోనా తర్వాతి నుంచి హైదరాబాద్‌లో అల్ట్రా లగ్జరీ గృహాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2020 క్యూ1లో 1,810 అల్ట్రా లగ్జరీ గృహాలు అందుబాటులో ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 2,070లకు, ఈ ఏడాది క్యూ1 నాటికి 3,030 యూనిట్లకు పెరిగాయి. ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే, చెన్నై, కోల్‌కతాలలో కంటే హైదరాబాద్‌ అఫర్డబుల్‌ హౌసింగ్‌ ఇన్వెంటరీ అతి తక్కువగా ఉంది. 2020 జనవరి–మార్చిలో నగరంలో 3,370 ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 5% క్షీణతతో 3,190 గృహాలకు చేరాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top