
ట్రయంఫ్ మోటార్ సైకిల్స్.. తన మేడ్ ఇన్ ఇండియా 400 సీసీ స్క్రాంబ్లర్ హై స్పెక్ వేరియంట్ (ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC) లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర రూ. 27000 ఎక్కువ.
రేసింగ్ ఎల్లో, స్టార్మ్ గ్రే, వెనిల్లా వైట్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC.. 398 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,000 rpm వద్ద 39.45 bhp పవర్.. 6,500 rpm వద్ద 37.5 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీని పనితీరు సాధారణ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మాదిరిగా ఉంటుంది.
స్క్రాంబ్లర్ 400 XC స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్, ఆఫ్ రోడ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్ థ్రోటిల్, టార్క్ అసిస్ట్ క్లచ్, USB ఛార్జింగ్ సాకెట్, సిగ్నేచర్ DRLలతో కూడిన ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి. డ్యూయల్ ఫార్మాట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రైడర్లు అవసరమైన అన్ని సమాచారాన్ని సులభంగా చూడవచ్చు.