పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంధన ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత ఏర్పడింది.ఇలాంటి సమయంలో మన దేశంలోని టొరెంట్ గ్యాస్ సంస్థ జైపూర్‌లో కేజీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను రూ.2.50 పెంచింది. దీంతో వినియోగదారులపై పెరుగుతున్న వ్యయ భారం మరింత పెరిగింది. ఇంధన ధరలలో విస్తృతమైన పెరుగుదల సవరణల మధ్య ఈ పెంపు చోటుచేసుకుంది, ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్లు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగాయి.
ఎల్‌పీజీ ధరలు
సీఎన్‌జీ ధరల పెంపుతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రధాన నగరాల వ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.195.50 పెరిగి రూ.2,078.50కి చేరింది. 5 కేజీల చిన్న సిలిండర్ల ధరలు కూడా రూ.51 మేర పెరిగింది. కోల్‌కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ల ధరలు ఏకంగా రూ.218 మేర పెరిగాయి.
ధరలు పెరుగుదలకు కారణం!
మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రపంచ మార్కెట్ పోకడల ఆధారంగా వాణిజ్య ఎల్‌పీజీ ధరలను నెలవారీగా సవరిస్తారు. తాజా ధరల పెంపునకు కారణం.. సౌదీ కాంట్రాక్ట్ ధరలో 44% భారీ పెరుగుదలే అని తెలుస్తోంది. ఈ ధర మార్చిలో మెట్రిక్ టన్నుకు 542 డాలర్ల నుంచి ఏప్రిల్‌లో మెట్రిక్ టన్నుకు 780 డాలర్లకు పెరిగింది. ఎల్‌పీజీ సరఫరా తగ్గిపోవడం కూడా సిలిండర్ ధరలు పెరగడానికి కారణం అవుతోంది.
ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!


