ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం! | Apple 50th Anniversary Sale iPhone 17 Price Cuts | Sakshi
Sakshi News home page

ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!

Apr 4 2026 3:17 PM | Updated on Apr 4 2026 4:03 PM

Apple 50th Anniversary Sale iPhone 17 Price Cuts

టెక్ దిగ్గజం ఆపిల్.. తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్'పై డిస్కౌంట్ ప్రకటించింది. కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి ఇది మంచి అవకాశం.

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.1,49,900. దీనిని కంపెనీ డిస్కౌంట్ కింద రూ.1,02,900కు అందిస్తోంది. అంటే రూ. 47వేలు తగ్గింపు లభిస్తోందన్నమాట. ఇందులో రూ.4000 క్యాష్ బ్యాక్, రూ.1000 తక్షణ తగ్గింపు మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్‌ కింద రూ.6000 డిస్కౌంట్ అందిస్తోంది. పాత ఫోన్‌లపై రూ. 36వేలు వరకు ఎక్స్ఛేంజ్ (మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది) లభిస్తుంది. ఈ ఆఫర్ ఆపిల్ అధీకృత రీసెల్లర్, ఇమాజిన్ స్టోర్‌లలో లభిస్తుంది.

ఈ సేల్‌లో ఐఫోన్ 17 ప్రో (256GB) కూడా ఉంది. దీనిని ఇప్పుడు రూ. 89,900లకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో తక్షణ డిస్కౌంట్ లభించదు. కానీ.. క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు లభిస్తాయి. స్టాండర్డ్ ఐఫోన్ 17 ధర కూడా చాలావరకు తగ్గింది. స్మార్ట్‌ఫోన్ ధరలు మాత్రమే కాకుండా.. ఐప్యాడ్ (2025), వై-ఫై + సెల్యులార్ వెర్షన్, ఐప్యాడ్ ప్రో (M5) లైనప్‌ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి.

ఇదీ చదవండి: బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?

Advertisement
 
Advertisement
Advertisement