
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతున్న పసిడి ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,200 (22 క్యారెట్స్), రూ.98,400 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.750, రూ.820 పెరిగింది.
చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.820 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.98,400 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.750 పెరిగి రూ.90,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.820 పెరిగి రూ.98,550 వద్దకు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగా కాకుండా బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. కేజీ వెండి రేటు నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉంది. దాంతో కేజీ సిల్వర్ ధర రూ.1,19,000గా ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)