ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) శుక్రవారం.. బ్రెజిల్‌లో ఏఐ పవర్డ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ కేంద్రం ఇన్‌స్పెర్స్ విలా ఒలింపియా క్యాంపస్‌లో ఉంది.
ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్.. కస్టమర్లు, భాగస్వాములు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు కలిసి ఏఐ & ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల శక్తి ద్వారా ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యాపారాలను మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా.. బ్రెజిల్, లాటిన్ అమెరికాకు సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి ఒక ప్రదేశంగా ఈ సెంటర్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
లాటిన్ అమెరికాలో పెట్టుబడి అనేది.. టీసీఎస్ యొక్క ప్రపంచ ఆవిష్కరణ కేంద్రాల నెట్‌వర్క్ విస్తరణను సూచిస్తుంది. కంపెనీ భాగస్వామ్యంతో.. ఇన్‌స్పెర్ కార్నెల్, ఇంపీరియల్ కాలేజ్, ఎంఐటీ & ఇతర విద్యా సంస్థలు టీసీఎస్ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో చేరనున్నాయి. లాటిన్ అమెరికాలో సంక్లిష్టమైన సామాజిక, మార్కెట్ సవాళ్లను పరిష్కరించడానికి పరిశోధన & ఆవిష్కరణలు ఉపయోగపడతాయి.
టీసీఎస్ కంపెనీ 2002లో లాటిన్ అమెరికాలో పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం అర్జెంటీనాతో సహా తొమ్మిది దేశాలలో.. 16 నగరాల్లో పనిచేస్తోంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీ ఎంత అభివృద్ధి చెందిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.


