Joint Family Tax Benefits: మీకు ఈ పన్ను ప్రయోజనాల గురించి తెలుసా!

Tax Benefits If You Have Joint Family Tips By Experts Advice - Sakshi

ఉమ్మడి కుటుంబంతో పలు పన్ను ప్రయోజనాలు ఉంటాయి. ఈ కింద పేర్కొన్న ఉదాహరణలతో ఉమ్మడి కుటుంబం ద్వారా పన్ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోవచ్చు. 
►  పూర్వీకుల నాటి పొలం. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టడంతో నష్టపరిహారం వచ్చింది. వరహాలగారి వసంతమ్మగారికి. ఆమెకు ముగ్గురు అబ్బాయిలు. భర్త లేరు. నష్టపరిహారాన్ని ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేశారు ఉమ్మడి కుటుంబం మీద. వడ్డీ ప్రతి ఏటా రూ. 12 లక్షలు వస్తుంది. వసంతమ్మగారికి ప్రతి నెలా రూ. 1,00,000 పెన్షన్‌ వస్తుంది. ముగ్గురు పిల్లలూ ఉద్యోగస్తులే. అందరికీ అదే రేంజిలో జీతభత్యాలు.
►  పూర్వీకులు ఇచ్చిన భవంతి మీద అద్దె ఏటా రూ. 9,00,000 వస్తుంది శ్రేష్టిగారికి. ఆయనకు కంపెనీలో పెద్ద ఉద్యోగం. రూ. 30,00,000 జీతం. శ్రేష్టిగారి తమ్ముడికి మంచి ఉద్యోగం, పెద్ద జీతం. అద్దెను ఎవ్వరూ వారి స్వంత అసెస్‌మెంట్‌లో చూపించరు. కుటుంబం పేరు మీదే లెక్కాడొక్కా. 
►  తనకున్న ఎనిమిది ఇళ్లనూ చూపిస్తూ, ఎటువంటి ఎగవేత లేకుండా అన్నింటికి పక్కా అగ్రిమెంట్లు, రెంట్లు, టీడీఎస్‌లు, పన్ను చెల్లింపులు సక్రమంగా చూపిస్తూ చక్రం తిప్పుతారు చక్రధర రావు చక చకా. 
►     తాతల నాటి ఇన్వెస్ట్‌మెంట్లు, షేర్లు, డిబెంచర్లమీద ఆదాయాన్ని కుటుంబం పేరిటే లెక్కిస్తున్నారు కోట్లకు ఎగబాకిన కోటేశ్వరరావు ఈ రోజుకీ. 
►      పూర్వీకుల నాటి నుంచి ఎంతో కలిసి వస్తున్న వ్యాపారం. మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి ఎంతో మందికి. పేరు పక్కన ‘సన్స్‌’, పేరు పక్కన ‘బ్రదర్స్‌’ ఇటువంటి బాపతే. తాతల నాటి నుంచి వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తి పాస్తులే నాడూ, నేడూ శ్రీరామరక్ష అని గుర్తుపెట్టుకోండి.  

ఇక్కడ కుటుంబ వడ్డీ కుటుంబానికే వచ్చింది కాబట్టి అలా లెక్కించాలి. అప్పుడు పన్ను భారం రూ. 1,17,000 అవుతుంది. అలా కాకుండా రూ. 12,00,000 వడ్డీని నలుగురికి సమానంగా పంచితే తలా రూ. 3,00,000 వస్తుంది. ఒక్కొక్కరికి రూ. 93,600 చొప్పున అదనంగా పన్నుభారం పడుతుంది. 80సి, 80డి ప్రయోజనం అదనంగా రాదు. మొత్తం మీద రూ. 3,74,400 మిగులుతుంది. ఈ మేరకు పన్ను మిగిలినట్లే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top