యూకే కీలక నిర్ణయం, భారీ లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు

జాతీయ, అంతర్జాతీయ అనుకూల పరిస్థితులు దేశీయ మార్కెట్లకు వరంగా మారాయి. ముఖ్యంగా యూకే ప్రభుత్వం ధనికులపై భారీ పన్నులను తొలగించడానికి ఇటీవల ఓ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నింది. అయితే తాజాగా ఆ విధానాన్ని ఉపసహరించుకున్నట్లు యూకే ప్రభుత్వం ప్రకటించింది. వెరసీ మార్కెట్లలో ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచింది.
ఈ పరిణామాల మధ్య ఉదయం 10.23 గంటల సమయానికి 1191 పాయింట్ల భారీ లాభంతో సెన్సెక్స్ 57960 వద్ద, నిఫ్టీ 349 పాయింట్ల లాభంతో 17236 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, లార్సెన్, ఎథేర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియాలు లాభాల్ని గడిస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ స్టాక్స్ నష్టాల్ని చవిచూస్తున్నాయి.