స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఆదాయం రూ. 188 కోట్లు  | Standard Glass Lining Technology Limited reported mixed Q2 financial results | Sakshi
Sakshi News home page

స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ ఆదాయం రూ. 188 కోట్లు 

Nov 6 2025 4:40 AM | Updated on Nov 6 2025 8:07 AM

Standard Glass Lining Technology Limited reported mixed Q2 financial results

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్టాండర్డ్‌ గ్లాస్‌ లైనింగ్‌ టెక్నాలజీ ఆదాయం రూ. 188 కోట్లుగా, లాభం రూ. 20 కోట్లుగా నమోదైంది. అర్ధ సంవత్సరానికి గాను ఆదాయం సుమారు 17 శాతం పెరిగి రూ. 366 కోట్లకు, లాభం దాదాపు 15 శాతం వృద్ధి చెంది రూ. 42 కోట్లకు చేరింది. సంస్థ పేరును స్టాండర్డ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీగా మార్చాలనే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. 

ఫార్మా, కెమికల్స్‌ తదితర రంగాలకు అవసరమైన హై ప్రెసిషన్‌ ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందించే దిగ్గజంగా ఎదిగే క్రమంలో తమ ప్రస్థానాన్ని ప్రతిబింబించేదిగా  ఇది ఉంటుందని కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. బయోటెక్నాలజీ, హై–ప్యూరిటీ సిస్టమ్స్‌లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు సైజెనిక్స్‌ ఇండియా కొనుగోలు, డిజైన్‌ నుంచి వేలిడేషన్‌ వరకు వివిధ ప్రక్రియల అనుసంధానానికి ప్రతిపాదిత సీ2సీ ఇంజనీరింగ్‌ కొనుగోలు సహాయపడతాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement