దక్షిణాదికి ఛాంపియన్‌ రంగాలు కావాలి

South India an ideal destination for doing business says CII - Sakshi

అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలి     

సీఐఐ చైర్‌పర్సన్‌ (సదరన్‌) సుచిత్ర కే ఎల్లా  

చెన్నై: వృద్ధికి మద్దతునిచ్చే, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే రంగాలను దక్షిణాది రాష్ట్రాలు గుర్తించాల్సిన అవసరం ఉందని సీఐఐ దక్షిణ ప్రాంత చైర్‌పర్సన్‌ సుచిత్ర కే ఎల్లా సూచించారు. అప్పుడు 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అవి సృష్టించుకోగలవన్నారు. వ్యాపార సులభతర నిర్వహణలో దేశంలోనే దక్షిణాది రాష్ట్రాలు ముందుండడం పట్ల ఆమె అభినందనలు తెలియజేశారు.

2025 నాటికి దక్షిణ ప్రాంతం 1.5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.117 లక్షల కోట్లు) ఆర్థిక కార్యకలాపాల స్థాయికి చేరుకునేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ.. వ్యాపార నిర్వహణకు అనుకూల ప్రదేశమని చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణలో దక్షిణాది రాష్ట్రాలకు మెరుగైన ర్యాంకులు ఇందుకు నిదర్శనమన్నారు.

ఈ అనుకూలతలను ఆసరాగా చేసుకుని, వృద్ధిని పెంచుకునేందుకు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలని సూచించారు. వ్యాపార నిర్వహణకు సంబంధించి వ్యయాలు, సులభత విధానాలు, వేగంగా కార్యకలాపాలు అనే అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు సీఐఐ దక్షిణ ప్రాంత డిప్యూటీ చైర్మన్‌ కమల్‌ బాలి తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top