పీటీఐతో సోనీ ఇండియా జట్టు

Sony India Tie Up With Pti To Provide Digital Imaging Solutions - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా అతి పెద్ద స్వతంత్ర న్యూస్‌ ఏజెన్సీ అయిన పీటీఐకి ప్రత్యేకంగా డిజిటల్‌ ఇమేజింగ్‌ సొల్యూషన్స్‌ అందించేలా సోనీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ప్రెస్ట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (పీటీఐ) ఫొటోగ్రాఫర్లు, వీడియో జర్నలిస్టులకు సోనీ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌ డిజిటల్‌ ఇమేజింగ్‌ సొల్యూషన్స్‌ సరఫరాదారుగా ఉంటుంది. ఆయా ఉత్పత్తులను వాడటంలో వారికి శిక్షణ కూడా ఇస్తుంది.

పీటీఐ వంటి విశ్వసనీయ న్యూస్‌ ఏజెన్సీతో జట్టు కట్టడం తమకు ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయమని సోనీ ఇండియా ఎండీ సునీల్‌ నయ్యర్‌ తెలిపారు. మరోవైపు వీడియో జర్నలిజంలోకి అడుగుపెడుతున్న తమకు.. కొంగొత్త టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ముందుండే సోనీతో భాగస్వామ్యం ఎంతగానో ప్రయోజనకరమని పీటీఐ సీఈవో విజయ్‌ జోషి చెప్పారు. పీటీఐ ప్రతి రోజూ 2,000 పైచిలుకు స్టోరీలు, 200 పైగా ఫొటోగ్రాఫ్‌లను సుమారు 500పైగా భారతీయ వార్తాపత్రికలకు  అందిస్తోంది.

చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే! 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top