ఫండ్స్‌ పెట్టుబడులకు థర్డ్‌పార్టీ చెల్లింపులు | SEBI Proposes Third Party MF Payments | Sakshi
Sakshi News home page

ఫండ్స్‌ పెట్టుబడులకు థర్డ్‌పార్టీ చెల్లింపులు

May 21 2026 4:28 PM | Updated on May 21 2026 4:43 PM

SEBI Proposes Third Party MF Payments

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో థర్డ్‌పార్టీ (ఇన్వెస్టర్‌ పేరిట మరొకరు) చెల్లింపులను అనుమతించే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల కింద మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఇన్వెస్టర్‌ తన బ్యాంక్‌ ఖాతా నుంచే ఆ మొత్తాన్ని బదిలీ చేయగలరు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలతో సెబీ ఈ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

ఉదాహరణకు ఉద్యోగి తరఫున పెట్టుబడులకు యాజమాన్యం చెల్లింపులు చేయొచ్చు. వేతనం నుంచి ఈ మేరకు యాజమాన్యం మినహాయించుకుంటుంది. అలాగే, అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు (ఏఎంసీలు) మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారులకు కమీషన్‌ను నగదు రూపంలో కాకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల రూపంలో చెల్లింపులు చేసేందుకూ ఈ ప్రతిపాదన వీలు కల్పించనుంది. అలాగే, ఇన్వెస్టర్లు తమ చందాలో లేదా రాబడిలో కొంత మొత్తాన్ని సామాజికాభివృద్ధికి అందించే ప్రతిపాదనను కూడా సెబీ చేసింది. జూన్‌ 10 వరకు వీటిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement