
సమయపాలన చాలా అవసరం అని చిన్నప్పుడే బడిలో చదువుకున్నాం. ఈ విధానాన్ని ఇప్పటికి కూడా కొన్ని కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఉద్యోగులందరూ ఖచ్చితమైన సమయానికి కార్యాలయానికి చేరుకోవాలని షరతులు కూడా పెడుతున్నాయి. అయితే ఇది సమంజసంగా లేదని ఓ రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ రోజు ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పటికీ పాఠశాల సంస్కృతిని పాటిస్తున్నాయి. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఉద్యోగులందరూ ఉదయం 9:30 గంటలకు తప్పకుండా ఆఫీసుకు రావాలి. ఆలస్యమైతే సగం రోజు లీవుగా పరిగణించడం జరుగుతుందని మా టీమ్ చాట్‌లో అధికారిక మెసేజ్ చేశారు.
ఆలస్యమైతే.. ముందుగా తెలియజేయాలి. ఎవరికీ తెలియజేయకుండా ఆలస్యంగా వస్తే మాత్రం హాఫ్-డేగా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ.. మనం ఇంకా స్కూల్లోనే ఉన్నామా?, పెద్దవాళ్లమయ్యామా? అని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు.

భారతదేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికీ 'సమయానికి రిపోర్ట్ చేయండి లేదా శిక్ష అనుభవించండి' అనే పాతకాలపు మనస్తత్వాన్ని ఎందుకు పట్టుకుంటున్నాయి? చేసే పని ముఖ్యం కాదా? అని రెడ్దిట్ అన్నారు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
కొందరు తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఆఫీసులకు ఆలస్యంగా వెళ్తే.. యజమానులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో పేర్కొన్నారు. ఆలస్యంగా వస్తే పనిష్మెంట్ ఉంటుంది.. కానీ అదనపు వర్క్ చేసినప్పుడు ఎలాంటి ప్రోత్సాహకం ఉండదని ఒకరు అన్నారు. మారుతున్న కాలంతోపాటు మనం కూడా మారాలి. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా అదే విధానాలు ఉన్నాయి కానీ చాలా అరుదుగా అమలు చేస్తాని మరొకరు పేర్కొన్నారు.