ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్, డబ్బులు డిడక్ట్‌ అవుతున్నాయని మెసేజ్‌ వచ్చిందా!

Sbi Deducted Rs 147 From Your Account,here Why - Sakshi

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఖాతాదారుల బ్యాంక్‌ అకౌంట్‌ల నుంచి డబ్బులు కట్‌ అయినట్లు మెసేజ్‌లు వెళుతున్నాయి. అయితే తాము ఎలాంటి ట్రాన్సాక్షన్‌ చేయకుండా డబ్బులు ఎందుకు డెబిట్‌ అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. 

బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు డిడక్ట్‌ అవ్వడంపై ఖాతాదారులు కంగారు పడాల్సిన అసవరం లేదని బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్యాలెన్స్‌ మెయింటెన్స్/ సర్వీస్‌ ఛార్జీలు పేరుతో ఖతా నుంచి రూ.147.50 డబ్బుల్ని డెబిట్‌ చేస్తున‍్నట్లు తెలిపారు. నాన్‌ బ్యాంక్‌ ఏటీఎం నుంచి డబ్బులు చేసి, ఆ ట్రాన్స్‌క్షన్‌ల లిమిట్‌ దాటిపోతే అదనపు ఛార్జీల వసూళ్లు సర్వసాధారణమని బ్యాంకులు చెబుతున్నాయి. ఎస్‌బీఐ తన కస్టమర్‌లు ఉపయోగించే డెబిట్ కార్డ్‌ల యాన్యువల్‌ ఫీ రూ.125 ఉండగా..అదనంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తుంది. దీంతో రూ.125కి జీఎస్టీ కలిపితే రూ.147.50కి అవుతుంది.  

ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ క్రెడిట్ కార్డ్ సంబంధిత లావాదేవీలపై విధించే అదనపు ఛార్జీలను సవరించింది. ఎస్‌బీఐ కార్డ్ తన వెబ్‌సైట్‌లో నవంబర్ 15, 2022 నుంచి అన్ని అద్దె చెల్లింపు లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము రూ.99 ప్లస్‌ జీఎస్టీ విధిస్తున్నట్ల పేర్కొంది. నాటి నుంచి అన్ని మర్చంట్ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము రూ.199కి సవరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top