5జీ ఫోన్లు వ‌చ్చేస్తున్నాయ్‌, ఫీచ‌ర్ల‌తో అద‌ర‌గొడుతున్నాయ్‌ | Samsung Galaxy A22 5g Launch Date In Europe Market | Sakshi
Sakshi News home page

5జీ ఫోన్లు వ‌చ్చేస్తున్నాయ్‌, ఫీచ‌ర్ల‌తో అద‌ర‌గొడుతున్నాయ్‌

Jun 4 2021 3:06 PM | Updated on Jun 4 2021 6:36 PM

Samsung Galaxy A22 5g Launch Date In Europe Market - Sakshi

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ మోడ‌ల్  గెలాక్సీ ఎ - 22 5జీ యురేపియ‌న్ మార్కెట్లో విడుద‌లైంది. త్వ‌ర‌లోనే ఈ ఫోన్లు ఇండియ‌న్ మార్కెట్ లో విడుద‌లవుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతం యురేపియ‌న్ మార్కెట్ లో విడుద‌లైన శాంసంగ్‌ గెలాక్సీ ఏ 22 5జీ ఫీచ‌ర్స్‌ ఇలా ఉన్నాయి

శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ లో 6.6-అంగుళాల పొడ‌వు. హెచ్‌డి + డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను క‌లిగి ఉంది.పేరులేని డ్రాగన్ ఆక్టా కోర్ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 అని తెలుస్తోంది.  8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజే తో  1టెరాబైట్ మైక్రో ఎస్డీ కార్డ్ ఉంది.  ఆప్టిక్స్ విషయానికొస్తే శాంసంగ్‌ గెలాక్సీ ఏ 22 5జి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను క‌లిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్‌, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్, ఎఫ్ / 2.2 లెన్స్‌, 5 మెగాపిక్సెల్ సెన్సార్, ఎ F / 2.4 లెన్స్ 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో  ఫోన్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ ధర ఎంతంటే 
గ్రే, మింట్, వైలెట్, వైట్ క‌ల‌ర్ ల‌లో అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ225జీ స్పెసిఫికేష‌న్స్ ఇలా ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5 జీ యూరో 229 (సుమారు రూ. 20,300) వద్ద ప్రారంభమవుతుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరో 249 (సుమారు రూ .22,100). ఈ ఫోన్‌ను 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే వాటి ధర ఎంత అనేది శాంసంగ్ నిర్ధారించ‌లేదు. 

చ‌ద‌వండి : Realme C21y : రియ‌ల్ మీ సిరీస్‌ ఫీచ‌ర్స్ ఇలా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement