రూ. 123 కోట్ల యాంకర్ నిధుల సమీకరణ
హైదరాబాద్: ఫార్మాస్యూటికల్ కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూ నేడు(24న) ప్రారభమై శుక్రవారం(27న) ముగియనుంది. ధరల శ్రేణి రూ. 372–392. తద్వారా రూ. 409 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 392 ధరలో 31,28,485 షేర్లు విక్రయించింది. తద్వారా రూ. 123 కోట్లు సమీకరించింది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 38 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యాంకర్ పెట్టుబడులు.. తమ బిజినెస్ మోడల్, వృద్ధి అవకాశాలు, నిర్వహణ సామర్థ్యాలపట్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు సాయి పేరెంటరల్స్ ఎండీ అనిల్ కుమార్ కె. చెప్పారు.


