రూపీ.. ‘లో’బీపీ | Rupee Hits Record Low at 93.53 Geopolitical Tensions Rising Crude Prices | Sakshi
Sakshi News home page

రూపీ.. ‘లో’బీపీ

Mar 21 2026 8:09 AM | Updated on Mar 21 2026 8:56 AM

Rupee Hits Record Low at 93.53 Geopolitical Tensions Rising Crude Prices

డాలర్‌తో పోలిస్తే మరో 64 పైసలు క్షీణత

తొలిసారి 93 దిగువకు; కొత్త ఆల్‌టైమ్‌ కనిష్టం

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్‌ రేట్లు పెరిగిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే శుక్రవారం 64 పైసలు క్షీణించి కొత్త ఆల్‌టైమ్‌ కనిష్టం 93.53 వద్ద క్లోజయ్యింది. రిస్కు తీసుకోవడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవడం, ముడిచమురు ధరలు ఎగియడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ఫారెక్స్‌ ట్రేడర్లు పేర్కొన్నారు.

భౌగోళిక రాజకీయ అనిశ్చితి రిసు్కల వల్ల ఇంధన రేట్లు పెరుగుతుండటంతో వాణిజ్య లోటు, ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఎగిసే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో పోలిస్తే రూపాయి ట్రేడింగ్‌ 92.92 వద్ద ప్రారంభమైంది. తర్వాత తొలిసారిగా 93 మార్కు దిగువకు పడిపోయింది. చివరికి 64 పైసల నష్టంతో ముగిసింది. రాబోయే రోజుల్లో రూపాయి మారకం 93.75–92.90 శ్రేణిలో తిరుగాడొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ తెలిపారు.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement