ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ వచ్చేసింది..! | Royal Enfields First EV Flying Flea C6 launched | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బుల్లెట్‌ వచ్చేసింది..!

Apr 10 2026 12:31 PM | Updated on Apr 10 2026 12:46 PM

Royal Enfields First EV Flying Flea C6 launched

ఐషర్‌ మోటార్స్‌ గ్రూప్‌నకు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ ‘ఫ్లయింగ్‌ ఫ్లీ సీ6’ను  మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పట్టణ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ను రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా డిజైన్‌ చేశారు.

ఎక్స్‌ షోరూం ధర రూ.2.79 లక్షలు. కాగా, ‘బ్యాటరీ–యాజ్‌–ఎ–సర్వీస్‌’ ఆప్షన్‌తో ధరను రూ.1.99 లక్షలు కంపెనీ నిర్ణయించింది. డెలివరీలు మే చివరి నుంచి ప్రారంభం కానున్నాయి.

‘‘కంపెనీ 125వ ఏడాదిలో ‘ఫ్లయింగ్‌ ఫ్లీ సీ6’ ద్వారా ఎలక్ట్రిక్‌ బైక్‌ల రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్‌ మార్పు మాత్రమే కాదు, నగర ప్రయాణాలకు సరికొత్త విధానాన్ని సృష్టించడం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వందేళ్లకు పైగా మంచి రైడింగ్‌ అనుభవం ఇవ్వడంపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు ‘ఫ్లయింగ్‌ ఫ్లీ’తో అదే అనుభవాన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లలో కొనసాగిస్తోంది’’ అని ఐషర్‌ మోటార్స్‌ ఎండీ, సీఈవో బి. గోవిందరాజన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement