ఎలక్ట్రిక్ వాహనాల దెబ్బకు ఆ కంపెనీలకు భారీ నష్టాలు..!

The rise of electric vehicles makes aluminium more attractive than steel - Sakshi

కరోనా మహమ్మారి కాలంలో వేగంగా వృద్ది చెందుతున్న రంగం ఏదైనా ఉంది అంటే ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. అయితే, గ్లోబల్ మొబిలిటీలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాటా పెరగడంతో హిందాల్కో వంటి అల్యూమినియం ఉత్పత్తిదారులు లాభపడితే.. ఉక్కు తయారీదారులు నష్టపోతున్నట్లు ఒక కొత్త పరిశోధన నివేదిక పేర్కొంది. మెటల్ రంగంలో ఉన్న దిగ్గజ టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యు స్టీల్ వంటి ఉక్కు ఉత్పత్తిదారుల కంటే హిందాల్కో ధర సుమారు 30% పేరుగుతున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జెఫెరీస్ తెలిపింది. 

అల్యూమినియం తేలికైన లోహాలలో ఒకటి. ఈ లోహాన్ని ఈవీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇనుముతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉండటం వల్ల ఈ లోహాన్ని ఏరోస్పేస్ పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. సాదారణ వాహనాలలో సగటున అల్యూమినియం వినియోగం కారులో సుమారు 50-70 కిలోగ్రాములు, ద్విచక్ర వాహనాల 20-30 కిలోలుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎలక్ట్రిక్ కారులో సగటున 250 కిలోల అల్యూమినియం ఉపయోగిస్తున్నారు.

ఫలితంగా, అల్యూమినియం బాడీలతో తయారు చేసే వాహనాలు ఇతర వాహనాల కంటే ఖరీదైనవిగా మారుతున్నాయి. అల్యూమినియం వినియోగం పెరగడం వల్ల ఉక్కు వంటి లోహానికి డిమాండ్ సెప్టెంబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. ఈవీలలో అల్యూమినియం ఎక్కువగా వినియోగించడానికి రేంజ్ ఒక ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ వాహన బరువు తగ్గడం వల్ల ఆ మేరకు వాహనం రేంజ్ అనేది పెరుగుతుంది. ఈవీ అమ్మకాలలో వాహన రేంజ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

(చదవండి: అదానీ గ్రూప్స్‌ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top