జియోఫోన్ యూజర్లకు పండగే, 'బై వన్‌ గెట్‌ ఫ్రీ వన్‌' ఆఫర్‌

Reliance Jio is offering Buy 1, Get 1 Free offer   - Sakshi

ఎప్పటిలాగే రిలయన్స్‌ జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.జియో ఫోన్‌ ప్రీ పెయిడ్‌ యూజర్లు కళ్లు చెదిరేలా 'బై వన్‌ గెట్‌ ఫ్రీ వన్‌' ఆఫర్లను ప్రకటించింది. ఉదాహరణకు జియో ఫోన్‌ యూజర్లు రూ.125తో రిఛార్జ్‌ చేసుకుంటే రూ.125 విలువ గల డేటా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. 

ఇటీవల ట్రాయ్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో ఎయిర్‌టెల్ 46.13 లక్షల మంది యూజర్స్‌ను కోల్పోయింది. అదే సమయంలో రిలయన్స్ జియో 35.54 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్స్‌ను సొంతం చేసుకుంది. దీంతో జియో మొత్తం యూజర్లు 43.12 కోట్లకు చేరుకున్నారు. అయితే వీరి సంఖ్యను మరింతగా పెంచేందుకు జియో ఆఫర‍్లను ప్రకటిస్తుంది. ఈ సారి ముఖ్యంగా గ్రామాల్ని టార్గెట్‌ చేస్తూ కొత్త కొత్త ఆఫర్లతో ఊరిస‍్తుంది. మరి ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

జియో రీఛార్జ్‌ ప్లాన్స్‌ 

జియో ఫోన్‌ వినియోగదారులకు జియో అందిస్తున్న రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఇలా ఉన్నాయి. అందులో రూ.39,రూ.69,రూ.75,రూ.125 రూ.155,రూ.185గా ఉంది. 

రూ.39 రీఛార్జ్ చేసుకుంటే అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌,14 రోజుల పాటు 100ఎంబీ డేటా అందిస్తుంది. ఆఫర్‌లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 100 ఎంబీ డేటాను అదనంగా పొందవచ్చు. 

రూ.69 రీఛార్జ్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 14రోజుల పాటు ప్రతీ రోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా మరో 14రోజుల పాటు ఉచితంగా 1 జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. 

రూ.75 రీఛార్జ్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 28 రోజుల వ్యాలిడిటీతో 3 జీబీ డేటాను అందిస్తుంది.  ఆఫర్‌లో భాగంగా 6జీబీ డేటాను పొందవచ్చు. 

రూ.125 రీఛార్జ్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 0.5జీబీని పొందవచ్చు. ఆఫర్‌లో భాగంగా ప్రతి రోజు 1జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. 

రూ.155 రీఛార్జ్‌ ప్లాన్‌తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌,28 రోజుల వ్యాలిడిటీతో 1జీబీ డేటా అందిస్తుండగా అదనంగా రోజుకు 2జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. 

రూ.185 రీఛార్జ్‌ ప్లాన్‌ తో అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 2జీబీడేటాను అందిస్తుండగా ఆఫర్‌లో భాగంగా ప్రతి రోజు 4జీబీ డేటాను వినియోగించుకునేలా రిలయన్స్‌ జియో ఆఫర‍్లను ప్రకటించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top