హైదరాబాద్‌ వెస్ట్‌ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్‌లు | Real estate Hyderabad west villa projects | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ వెస్ట్‌ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్‌లు

Jul 5 2025 4:43 PM | Updated on Jul 5 2025 5:06 PM

Real estate Hyderabad west villa projects

కోవిడ్‌ తర్వాత విల్లాలపై ఆసక్తి మరింత పెరిగింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతోంది. ఎక్స్‌ఛేంజ్‌ రేటు తక్కువగా ఉండటం కారణంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. - సాక్షి, సిటీబ్యూరో

పశ్చిమంలో హవా.. 
హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌లో పశ్చిమ ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్‌ లాంచింగ్స్‌ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్‌లో 8 శాతం, సౌత్‌ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్‌ జరిగాయి.

వెస్ట్‌ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్‌ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్‌ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement