breaking news
West Hyderabad
-
హైదరాబాద్ వెస్ట్ హవా.. జోరుగా విల్లా ప్రాజెక్ట్‌లు
కోవిడ్ తర్వాత విల్లాలపై ఆసక్తి మరింత పెరిగింది. సామాన్య, మధ్యతరగతితో పోలిస్తే కరోనా లగ్జరీ గృహ కొనుగోలుదారుల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. ఫలితంగా ఈ విభాగం గృహ విక్రయాలలో వృద్ధి నమోదవుతోంది. ఎక్స్ఛేంజ్ రేటు తక్కువగా ఉండటం కారణంగా ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) లగ్జరీ గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు డెవలపర్లు అందించే డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఆయా వర్గాల కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. - సాక్షి, సిటీబ్యూరోపశ్చిమంలో హవా.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో పశ్చిమ ప్రాంతాల హవా కొనసాగుతోంది. మూడు త్రైమాసికాల నుంచి కొత్త ప్రాజెక్ట్స్ లాంచింగ్స్ పశ్చిమ హైదరాబాద్‌లో 57 శాతం జరిగాయి. ఉత్తరాదిలో 18 శాతం, తూర్పులో 15 శాతం, సెంట్రల్లో 8 శాతం, సౌత్ హైదరాబాద్‌లో 2 శాతం లాంచింగ్స్ జరిగాయి.వెస్ట్ హైదరాబాద్‌లో తెల్లాపూర్, బాచుపల్లి, సౌత్‌లో అత్తాపూర్‌లు రియల్టీ హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఓపెన్ ప్లాట్లలో పెట్టుబడులు పెట్టే బదులు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందన్న సూత్రం ప్రకారమే.. డెవలపర్లు కూడా ప్రాజెక్ట్ లాంచింగ్‌లలో లగ్జరీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. -
CREDAI: అందుబాటు గృహాలకు స్థలాలు కేటాయించండి!
సాక్షి, హైదరాబాద్: సామాన్య, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేయాలంటే అందుబాటు గృహాలను నిర్మించాలి. చందన్వెల్లి, కొత్తూరు వంటి పలు ప్రాంతాలలో తయారీ రంగం అభివృద్ధి చెందింది. ఆయా ప్రాంతాలలో రూ.50 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్‌కు డిమాండ్ ఉంది. కానీ, స్థలాలు అందుబాటులో లేవు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కలి్పంచడంతో పాటు స్థలాలను అందించాలని’’ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐటీ, ఫార్మా రంగాలతో అభివృద్ధి పశి్చమ హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆయా ప్రాంతాలలో లగ్జరీ ప్రా జెక్ట్లు ఎక్కువగా వస్తున్నాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుని సొంతింటి కల మరింత భారంగా మా రిందని, దీనికి పరిష్కారం అందుబాటు గృహాల నిర్మాణమేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ స్థలాలను గుర్తించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఆయా గృహాలను విక్రయిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలి మహిళా గృహ కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతానికి తగ్గించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఈ పథకం అమలు చేశారని గుర్తు చేశారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుల మధ్య రేడియల్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రమే చేస్తున్నామని, అనుమతులు మాత్రం భౌతికంగానే జారీ అవుతున్నాయని తెలిపారు. అనుమతులను కూడా ఆన్లైన్లో జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
తూర్పు వర్సెస్ పశ్చిమం!
‘‘హైదరాబాద్‌లో రియల్ రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే.. పట్టాలపై మెట్రో పరుగులు తీయాలి. లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలి. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో తూర్పు, పశ్చిమ హైదరాబాద్‌లో రియల్ పరుగులు పెడుతుందని’’ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎండీ నర్సయ్య చెప్పారు. నిర్మాణ రంగంలో రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. - సాక్షి, హైదరాబాద్ హాట్ స్పాట్స్ ఉప్పల్, నాగోల్, పోచారం, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, సాగర్ రోడ్డు, హయత్‌నగర్, వరంగల్ హైవే, ఆదిభట్ల. గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, అప్పా జంక్షన్, కిస్మత్పూర్, నలగండ్ల, తెల్లాపూర్, కూకట్పల్లి, హైదర్‌నగర్, మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి. స్థిరాస్తి రంగంలో ఉప్పల్, గచ్చిబౌలి మధ్య పోటాపోటీ ఈస్ట్‌జోన్‌కు మెట్రో.. వెస్ట్ జోన్‌కు ఎయిర్పోర్ట్, ఓఆర్‌ఆర్‌ల దన్ను తూర్పు హైదరాబాద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన మెట్రో రైలు తొలిసారిగా పరుగులు పెట్టేది తూర్పు హైదరాబాద్ నుంచే. ఇప్పటికే ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది కూడా. మరోవైపు పరిశ్రమల నుంచి పరిశోధన సంస్థల వరకు, ఆసుపత్రుల నుంచి వినోద కేంద్రాల వరకు అన్ని రంగాలకూ వేదిక తూర్పు హైదరాబాద్. ప్రత్యేకించి ఎన్జీఆర్ఐ, సీసీఎంబీ, ఐఐసీటీ, సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరెటరీ వం టి కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలకు చిరునామాగా నిలుస్తుంది. జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్, మైండ్‌స్పేస్ వంటి ఐటీ కంపెనీలూ ఉన్నాయిక్కడ. పశ్చిమ హైదరాబాద్ ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, కేపీవో ఆర్థిక సంస్థలకు చిరునామా. లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులతో నిత్యం కిటకిటలాడే ప్రాంతం నగరాభివృద్ధిలో కీలకంగా మారింది. గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ మీదుగా సులువుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు కూడా. అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలకిక్కడ కొదవేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కళ్లు మిరుమిట్లుగొలిపే కొత్త ప్రపంచమిది. పాశ్చాత్య, మెట్రో నగరాలను తలదన్నేలా పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. ఐటీఐఆర్: నగరం చుట్టూ 50 వేల ఎకరాల్లో మొత్తం 202 చ.కి.మీ పరిధిలో హైదరాబాద్ ఐటీ టెక్నాలజీ పెట్టుబడుల ప్రాంతం (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ కింద ఐటీ ఆధారిత సర్వీసులు, హార్డ్‌వేర్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నారు. క్లస్టర్-3లో భాగంగా ఉప్పల్, పోచా రం ప్రాంతాల్లో 10.3 చ.కి.మీ. పరిధి లో ఐటీఐఆర్ రానుంది. ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్-1లో 11.5 చ.కి.మీ., గ్రోత్ కారిడార్-2లో 14.3 చ.కి.మీ. పరిధిలో కూడా ఐటీఐఆర్ రానుంది. కారిడార్-3లో నాగోల్-శిల్పారామం మధ్య 28 కి.మీ మేర మెట్రో రైలు రానుంది. మొత్తం 23 స్టేషన్లుంటాయి. ఇప్పటికే నాగోల్ నుంచి మెట్టుగూడ.. 8 కి.మీ. దూరం మెట్రో ట్రయల్ రన్ పెడుతోంది. ఈ మార్గంలో హబ్సిగూడ, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియాల్లో మెట్రో స్టేషన్లుంటాయి. మిగతా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ఇటు సికింద్రాబాద్‌కు, అటు హైటెక్‌సిటీకి ప్రయాణ సమయం తగ్గుతుంది. కారిడార్-1లో మియాపూర్- ఎల్బీనగర్ మధ్య 29 కి.మీ మెట్రో రైలు రానుంది. మొత్తం 27 స్టేషన్లుంటాయి. ప్రస్తుతమున్న మెట్రో రైలును శిల్పారామం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకూ, మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా పొడిగించే విషయమై మెట్రో అధికారులు ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే పశ్చిమ హైదరాబాద్ రూపురేఖలు మారుతాయనడంలో సందేహం లేదు. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ఘట్కేసర్ పాయింట్) 6 కి.మీ. దూరం మాత్రమే ఉండటంతో శంషాబాద్ విమానాశ్రయానికి, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే సరైంది. అలాగే హబ్సిగూడ నుంచి బోగారం జంక్షన్ 19 కి.మీ. భూ సేకరణ, రోడ్డు విస్తరణ పనులు, సర్వే ఆఫ్ ఇండియా నుంచి మేడిపల్లి 12 కి.మీ. పరిధిలో భూ సేకరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో నగరం మొత్తాన్ని కలుపుతూ నిర్మించిన ఔటర్ రింగ్‌రోడ్డు. 22 కి.మీ. గల గచ్బిబౌలి-శంషాబాద్ రోడ్డు, 23.7 కి.మీ. గల నార్సింగి-పటాన్చెరు రోడ్డు పశ్చిమ హైదరాబాద్ మీదుగానే వెళుతుంది. గచ్చిబౌలిలో ఓఆర్ఆర్ నుంచి నగరం చుట్టూ 125 కి.మీ. వరకూ సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ధరల్లో తేడా.. రియల్ రంగంలో తూర్పు, పశ్చిమ హైదరాబాద్ ఒకదానితో ఒకటి పోటీపడుతున్నా.. ధరల్లో మాత్రం పశ్చిమ హైదరాబాద్ ముందుంది. ఎందుకంటే ఐటీ, ఫైనాన్షియల్ హబ్‌ల కారణంగా ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం. పశ్చిమ హైదరాబాద్‌లో విల్లాలకు, లగ్జరీ ఫ్లాట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. చ.అ.కు సుమారు రూ.3,800 నుంచి చెబుతున్నారు. ప్రాంతం, బిల్డరు, సౌకర్యాలు, నిర్మాణ ప్రత్యేకతలను బట్టి అంతిమ ధర మారుతుంటుంది. తూర్పు హైదరాబాద్: ఇది మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ప్రాంతం. మాళ్లు, మల్టీప్లెక్స్‌లతో ఇప్పుడిప్పుడే ఇది ఉన్నత శ్రేణి ప్రాంతంగా వృద్ధి చెందుతోంది. ఇక్కడ చ.అ. రూ.2,300 నుంచి చెబుతున్నారు.