
ముంబై: భారత ఫైనాన్షియల్ వ్యవస్థ గతం కంటే పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బలమైన ఎదురుగాలులు వీస్తున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ వాటిని ఎదుర్కొంటోందని అన్నారు.
డిప్యూటీ గవర్నర్ జేపీ మోర్గాన్ ఇండియా లీడర్‌షిప్ సిరీస్ ఉపన్యాసం చేస్తూ, 2024లో జీ20 సభ్యులలో భారతదేశం అత్యధిక వాతావరణ మార్పు పనితీరు సూచిక (సీసీపీఐ) స్కోర్‌ను సాధించిందని అన్నారు. వాతావరణ పరిరక్షణ విషయంలో భారత్ చిత్తశుద్దిని తెలియజేస్తున్నట్లు వివరించారు. దేశంలో గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్లకూ ఇది దోహదం చేసే అంశమని తెలిపారు. బ్యాంకింగ్ రంగం పటిష్ట బాటలో పయనిస్తోందని అన్నారు.