
చెన్నై: రామ్‌కో సిమెంట్స్ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రకటించిన ‘ఏఐ అవార్డ్స్ 2025’ ఇన్నోవేటివ్ విభాగంలో ‘ఎక్సలెన్స్ ఇన్ బెస్ట్ ఏఐ సొల్యూషన్ షోకేస్’ అవార్డు గెలుచుకుంది. కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్ అమలు చేయడం ద్వారా పరిశ్రమలో డిజిటల్ పరివర్తన(సొల్యూషన్స్)ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో రామ్‌కో సిమెంట్స్ విశేష ప్రతిభ కనబర్చిందని అవార్డుల జ్యూరీ అభిప్రాయపడింది. రామ్‌కో ప్రతినిధులు మాట్లాడుతూ... ‘‘అవార్డు సొంతం చేసుకోవడం గర్వకారణం. సాంకేతికతను వినియోగించి కస్టమర్లకు ఉత్తమ పరిష్కారాలు అందించేందుకు, షేర్ హోల్డర్లకు విలువ సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు.