ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వే ఒక కీలక మార్పు ప్రవేశపెట్టింది. చివరి నిమిషంలో ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు మార్చుకోవచ్చు. గతంలో బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు కలిగేవి.
బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడంలో IRCTC కొంత స్వేచ్ఛ కల్పించింది. ముఖ్యంగా ట్రాఫిక్, ఆలస్యం వంటి కారణాల వల్ల ఎంపిక చేసుకున్న స్టేషన్‌కు సమయానికి చేరుకోలేని పరిస్థితుల్లో ఈ సదుపాయం సహాయపడుతుంది. ఈ సదుపాయం ప్రధానంగా IRCTC ద్వారా బుక్ చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ఒకసారి స్టేషన్ మార్చిన తర్వాత, తప్పనిసరిగా కొత్తగా ఎంచుకున్న స్టేషన్ నుంచే రైలులో ఎక్కాలి.
ఈ సౌకర్యాన్ని ఉపయోగించేటప్పుడు.. కొత్తగా ఎంపిక చేసిన స్టేషన్ నుంచి కూడా రైలును మిస్ అయితే, టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం అవసరం. ఈ విషయాన్ని వినియోగదారులు తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: 'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'


