ప్రయివేట్‌ ఈక్విటీ పెట్టుబడుల నేలచూపు | Private equity inflows plunge 65 pc to USD 1 81 billion in July September | Sakshi
Sakshi News home page

ప్రయివేట్‌ ఈక్విటీ పెట్టుబడుల నేలచూపు

Oct 13 2023 8:52 AM | Updated on Oct 13 2023 9:09 AM

Private equity inflows plunge 65 pc to USD 1 81 billion in July September - Sakshi

ముంబై: దేశీయంగా ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ కేలండర్‌ ఏడాది(2023) మూడో త్రైమాసికంలో 65 శాతం క్షీణించాయి. 1.81 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2022) జులై–సెప్టెంబర్‌(క్యూ3)లో ఏకంగా 5.23 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ నమోదయ్యాయి.

లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ గ్రూప్‌ బిజినెస్‌ సంస్థ రెఫినిటివ్‌ వివరాల ప్రకారం లావాదేవీలు సైతం భారీగా 50 శాతం నీరసించాయి. 465 నుంచి భారీగా తగ్గి 232కు పరిమితమయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌(క్యూ2)లో నమోదైన 353తో పోలిస్తే డీల్స్‌ 34 శాతం వెనకడుగు వేయగా.. విలువ(2.79 బిలియన్‌ డాలర్లు) 35 శాతం క్షీణించింది. కాగా.. 2023 జనవరి–సెప్టెంబర్‌లో డీల్స్‌ 414 నుంచి 283కు తగ్గాయి. ఇంటర్నెట్‌ ఆధారిత కంపెనీలలో 2.8 బిలియన్‌ డాలర్లు, ఐటీ సంస్థలలో 1.48 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement