పోకో మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఫోన్‌: తక్కువ ధరలోనే‌

Poco X3 Pro Launched In India - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ పోకో మరొక మొబైల్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో పోకో ఎక్స్ 3 ప్రోను మంగళవారం లాంచ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన పోకో ఎక్స్‌3 కి అప్‌గ్రేడ్‌గా ఈ ఫోన్‌ రానుంది. పోకో ఎక్స్ 3 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 చిప్‌ను అమర్చారు. పోకో ఎక్స్ 3 ప్రో క్వాడ్ రియర్ కెమెరాతో పాటు 120 హెర్ట్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పోకో ఫోన్ 25 జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంది. పోకో ఎక్స్ 3 ప్రో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్ 62, రియల్‌ మీ ఎక్స్ 7, వివో వి 20 మొబైల్‌ ఫోన్లతో పోటీపడనుంది.

కాగా, పోకో ఎక్స్ 3 ప్రో( 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) వేరియంట్‌కు రూ. 18,999 కాగా, (8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్) మోడల్ ధర రూ. 20,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ గోల్డెన్ బ్రాంజ్‌, గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్ లో రానుంది. ఈ మొబైల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 6, మధ్యాహ్నం 12  నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇక ఆఫర్‌ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు  ద్వారా  కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.1000 వరకు 10శాతం  డిస్కౌంట్‌ రానుంది.

పోకో ఎక్స్ 3 ప్రో ఫీచర్స్
    6.67 అంగుళాల(1080*2400 పిక్సెల్స్) ఫుల్ హెచ్ డీ డిస్ప్లే
    ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ చేసే ఎంఐయుఐ12
    క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్
    హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
    48+8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 ఎంపీ మాక్రో కెమెరా
    20 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
    సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
    3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్
    5160ఎంఏహెచ్ బ్యాటరీ
    33వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
    8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.20,999
    6జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.18,999

చదవండి: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొత్త మాల్‌వేర్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top