Punjab National Bank: పీఎన్‌బీ ఖాతాదారులకు శుభవార్త!

PNB FD interest rates hike for senior super seniors know details - Sakshi

సాక్షి,ముం​బై:  ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్‌లు, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు శుభవార్త అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్‌లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది.

పీఎన్‌బీ సీనియర్ సిటిజన్‌లు, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది.  సీనియర్ సిటిజన్‌ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్‌ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు  30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది.

60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్‌లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్‌ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్‌ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా  సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు  పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్‌లకు గరిష్టంగా 180 బీపీఎస్‌ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్‌బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్‌లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్‌ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top