పేటీఎంలో లావాదేవీలు రెట్టింపు

Paytm Q2 GMV more than doubles to Rs 1,95,600 crore - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల వ్యాపార విలువ (జీఎంవీ) రెట్టింపై రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో జీఎంవీ రూ. 94,700 కోట్లు. నిర్దిష్ట కాల వ్యవధిలో తమ యాప్, పేమెంట్‌ సాధనాలు మొదలైన వాటి ద్వారా వ్యాపారస్తులకు మొత్తం చెల్లింపు లావాదేవీలను పేటీఎం జీఎంవీగా పరిగణిస్తుంది.

వినియోగదారుల మధ్య జరిగే నగదు బదిలీ వంటి పేమెంట్‌ సర్వీసులను పరిగణనలోకి తీసుకోంది. కంపెనీ గణాంకాలను బట్టి జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో నెలవారీగా లావాదేవీలు జరిపే యూజర్ల సంఖ్య 33 శాతం పెరిగి 4.3 కోట్ల నుంచి 5.7 కోట్లకు పెరిగింది. ఇక పేటీఎం ద్వారా మంజూరు చేసిన రుణాల విలువ 500 శాతం ఎగిసి రూ. 210 కోట్ల నుంచి రూ. 1,260 కోట్లకు చేరింది. స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టయిన తర్వాత పేటీఎం బోర్డ్‌ తొలిసారిగా ఆర్థిక ఫలితాలను ఆమోదించేందుకు నవంబర్‌ 27న సమావేశం కానుంది.

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో పేటీఎం షేరు సుమారు 13 శాతం క్షీణించి రూ. 1,362 వద్ద క్లోజయ్యింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top