మార్కెట్లో ‘మెలొడీ’ సందడి!  | Parle Industries jumps 5percent after Modi-Meloni Melody buzz | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ‘మెలొడీ’ సందడి! 

May 21 2026 12:39 AM | Updated on May 21 2026 12:40 AM

Parle Industries jumps 5percent after Modi-Meloni Melody buzz

ఇటలీ పీఎం మెలొనీకి మోదీ గిఫ్ట్‌తో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ 

చర్చనీయాంశంగా టాఫీ ఎగుమతులు

గత 12 ఏళ్లలో 166 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి పార్లే ‘మెలొడీ’ టాఫీలను బహూకరించడం బుధవారం సోషల్‌ మీడియాలో సందడికి దారితీసింది. భారత్‌ నుంచి టాఫీ ఎగుమతులు ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టాఫీలు తదితర కన్ఫెక్షనరీ ఉత్పత్తుల ఎగుమతులు గత 12 ఏళ్లలో ఏకంగా 166 శాతం ఎగిసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. 

2013–14లో రూ. 49.68 కోట్లుగా ఉన్న ఎక్స్‌పోర్ట్స్‌ 2025–26 నాటికి రూ. 132 కోట్లకు చేరినట్లు తెలిపింది. పరిమాణంపరంగా 6,652 టన్నుల నుంచి 10 శాతం వృద్ధి చెంది 7,357 టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా తదితర 74 దేశాలకు ఎగుమతవుతున్నాయి. ‘భారత టాఫీల గాథ నిజంగానే వీనులవిందైనది. 

2013–14 నుంచి ఏకంగా 166 శాతం ఎగిసింది’  అని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గో యల్‌ బుధవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. గతంలో టాఫీల ఎగుమతులు అంతగా లేని యూ రప్, గల్ఫ్‌ దేశాలకు కూడా పెరగడం భారత కన్ఫెక్షనరీల నాణ్యత, ప్యాకేజింగ్‌ ప్రమాణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని వా ణిజ్య శాఖ తెలిపింది. ‘చాలా చక్కని టాఫీ– మెలొ డీని బహూకరించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అంటూ మెలోనీ సోషల్‌ మీడియాలో వీడి యో పోస్ట్‌ చేశారు. ఇరువురు ప్రధానుల పేర్లు కలిసేలా మెలొడీ పదం ఉండటంతో మీమ్స్‌ వైరల్‌ అయ్యాయి.  

మెలొడీకి జోష్‌.. 
మెలొడీ చాక్లెట్లకు ఒక్కసారిగా ఎక్కడలేని పాపులారిటీ రావడంపై వాటిని తయారు చేసే పార్లే ప్రోడక్ట్స్‌ హర్షం వ్యక్తం చేసింది. ‘1983 నుంచి బంధాలను తీపి చేస్తున్నాం’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్ట్రాగాంలో మోదీ, మెలొనీ వీడియోని షేర్‌ చేసింది. ‘పార్లే మెలొడీని అంతర్జాతీయ వేదికపైకి చేర్చినందుకు ధన్యవాదాలు‘ 
అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ‘భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఒక చక్కని మార్గం’ అంటూ పార్లే ప్రోడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ షా పేర్కొన్నారు.  

‘పార్లే’ షేర్ల కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు... 
మెలొడీ చాక్లెట్లను తయారు చేసేది పార్లే అనే కంపెనీ అని తెలియడంతో ఆ సంస్థ షేర్లను కొనడానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనితో పార్లే ఇండస్ట్రీస్‌ అనే సంస్థ షేరు 5 శాతం ఎగిసి అప్పర్‌ సర్క్యూట్‌ రూ. 5.25ని తాకింది. 8.57 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఆ చాక్లెట్లను తయారు చేసేది 
పార్లే ప్రోడక్ట్స్‌ అనే కంపెనీ. అది స్టాక్‌ మార్కెట్లో కనీసం లిస్ట్‌ కూడా కాలేదు. కాకపోతే ‘ఆ పార్లే’..‘ఈ పార్లే’ ఒకటేనని ఇన్వెస్టర్లు పొరబడటమనేది పార్లే ఇండస్ట్రీస్‌కి బాగా 
కలిసి వచ్చింది.  

Advertisement
 
Advertisement
Advertisement