అందుకేనా 'ఒరాకిల్‌'లో ఉద్యోగుల తొలగింపు! | Oracle Layoffs Spark Outrage Amid Surge in H1B Hiring | Sakshi
Sakshi News home page

అందుకేనా 'ఒరాకిల్‌'లో ఉద్యోగుల తొలగింపు!

Apr 5 2026 4:34 PM | Updated on Apr 5 2026 4:53 PM

Oracle Layoffs Spark Outrage Amid Surge in H1B Hiring

ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ వేలాది ఉద్యోగులను తొలగించిన విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన మరువకముందే.. కంపెనీ విదేశీ ఉద్యోగులను నియమించడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమైంది.

యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు సంబంధించిన ఫెడరల్ డేటా ప్రకారం.. ఒరాకిల్ 2025-26 ఆర్థిక సంవత్సరాలలో H-1B కార్మికులను నియమించుకోవడానికి సుమారు 3,126 పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో 2026లో మాత్రమే 436 దరఖాస్తులు ఉన్నాయి.

టెక్నాలజీ, రక్షణ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ ఉద్యోగులను కంపెనీ నియమించుకోవచ్చు. అయితే... అంతకంటే ముందు సంస్థలో అదే నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేరని సంస్థ నిరూపించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఒరాకిల్ భారీ లేఆఫ్స్ చేపట్టిందని చెబుతున్నారు.

ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చాలామంది ఉద్యోగులు అకస్మాత్తుగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ పంపిన ఈమెయిల్‌లో సంస్థ అవసరాల దృష్ట్యా మీ ఉద్యోగాన్ని రద్దు చేస్తున్నామని తెలియజేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారికి కొంతమేర పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఒరాకిల్ కంపెనీ కంటే ముందు.. అమెజాన్ కూడా 16000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో 2675 H-1B పిటిషన్లు దాఖలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఇది పెద్ద కంపెనీలు అనుసరిస్తున్న ఒక సాధారణ ధోరణిగా కనిపిస్తోంది. దీనిని అమెరికాలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ ఉద్యోగులను ఎక్కువగా నియమించడం వల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతున్నాయని వారు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే?

Advertisement
 
Advertisement
Advertisement