ఒక్కసారిగా పేలిన ఫోన్‌ ఛార్జర్‌...! స్పందించిన కంపెనీ...!

Oneplus Charger Exploded In Kerala And Company Responds - Sakshi

OnePlus Nord 2 5G-Related Explosion: వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ పేలిందంటూ ఢిల్లీ న్యాయవాది వన్‌ప్లస్‌ కంపెనీపై కేసు వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు బెంగుళూరుకు చెందిన మహిళ హ్యాండ్‌బ్యాగ్‌లో వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ పేలిందంటూ ఆరోపణలు వచ్చాయి. వరుస పేలుడు సంఘటనలు ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
చదవండి: జియో ఫోన్‌ లాంచ్‌కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్‌ అంబానీ కన్ను..!

తాజాగా వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ ఛార్జర్‌ పేలిందంటూ కేరళ వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  కేరళకు చెందిన జిమ్మీ రోజ్‌ వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌ను ఎలక్ట్రిక్‌ వాల్‌ సాకెట్‌కు కనెక్ట్‌ చేయగా... ఒక్కసారిగా భారీ శబ్దంలో పేలిందని ట్విటర్‌లో చిత్రాలను పోస్ట్‌ చేశాడు. ఛార్జర్‌ పేలడంతో ఒక్కసారిగా షాక్‌ గురయ్యానని జిమ్మీ రోజ్‌ తెలిపాడు.  

స్పందించిన వన్‌ప్లస్‌...!
ఛార్జర్‌ పేలిన సంఘటనపై వన్‌ప్లస్‌ స్పందించింది. కంపెనీ అందించిన పరికరాల్లో ఎలాంటి లోపాలు లేవని పేర్కొంది. ఒక్కసారిగా వచ్చిన వోల్టేజ్ హెచ్చుతగ్గుల వంటి బాహ్య కారకాల వల్లే పేలుడు సంభవించిందని పేర్కొంది. వన్‌ప్లస్‌ ఒక ప్రకటనలో కస్టమర్లు చేసే ఈ క్లెయిమ్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా యూజర్‌కు రీప్లేస్‌మెంట్‌ కూడా అందించామని వన్‌ప్లస్‌ వెల్లడించింది. 

ఛార్జర్‌ పేలడానికి గల కారణాలను యూజర్‌కు నివృత్తి చేశామని తెలిపింది. వోల్టోజ్‌ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు శక్తివంతమైన కెపాసిటర్లను ఛార్జర్‌లో ఏర్పాటు చేస్తామని కంపెనీ పేర్కొంది.  ఛార్జర్‌ పేలుడు సంఘటనను వన్‌ప్లస్‌ క్షుణంగా విశ్లేషించింది. బాహ్య కారకాల వల్లే పేలుడు సంభవించిందని వన్‌ప్లస్‌ పేర్కొంది.

చదవండి: ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడేవారిపై సైబర్‌ నేరస్తుల దాడులు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top