''ఇరాన్‌తో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం'' చర్చలు జరుగుతున్నాయని అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే చమురు ధరలు 13 శాతానికి పైగా పడిపోయాయి. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 96 డాలర్లకు, అంటే 14 శాతం వరకు తగ్గింది.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 17 డాలర్లు, అంటే 15 శాతం పడిపోయి, 1108 GMT సమయానికి బ్యారెల్‌కు 96 డాలర్ల సెషన్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 13 డాలర్లు, అంటే సుమారు 13.5 శాతం పడిపోయి, సెషన్ కనిష్ట స్థాయి అయిన 85.28 డాలర్లకు చేరింది.
అయితే.. ట్రంప్ పేర్కొన్నట్లు అటువంటి చర్చలు ఏవీ జరగలేదని ఇరాన్ ఖండించిన తర్వాత, చమురు ధరలు సుమారు 5 శాతం పెరిగి బ్యారెల్‌కు 101 డాలర్లకు చేరుకున్నాయి, కానీ మళ్లీ 100 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.
అమెరికా,ఇజ్రాయెల్ - ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. సంఘర్షణకు ముందు బ్యారెల్‌కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ఈ ధరలు, ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగడం, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలపై జరిగిన దాడుల కారణంగా, సోమవారం నాటికి బ్యారెల్‌కు సుమారు 112 డాలర్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. కేవలం గత 30 రోజుల్లోనే ముడి చమురు ధరలు ఎంత గరిష్టాలకు చేరుకున్నాయో స్పష్టమవుతోంది.
Trump announces he ordered to postpone strikes against Iranian energy infrastructure for 5 days pic.twitter.com/ELW18FLsAL
— The Daily News (@DailyNewsJustIn) March 23, 2026


