NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి! | No Cash On Toll Booths From April 10 FASTag or UPI Mandatory | Sakshi
Sakshi News home page

NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!

Apr 6 2026 3:27 PM | Updated on Apr 6 2026 4:15 PM

No Cash On Toll Booths From April 10 FASTag or UPI Mandatory

జాతీయ రహదారులపై ప్రయాణించేవారి ప్రయాణాన్ని మరింత సుగమనం చేయడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఫాస్ట్‌ట్యాగ్. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇది ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నట్లు కూడా వెల్లడించింది.

ఎన్‌హెచ్ఏఐ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు ఉండవు. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే అన్నమాట. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం లక్ష్యంగా ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు NHAI స్పష్టం చేసింది.

ఇప్పటివరకు టోల్ చెల్లింపుల కోసం నగదు, ఫాస్ట్‌ట్యాగ్ వంటి పద్ధతులు ఉపయోగించేవారు. కానీ కొత్త నియమాల ప్రకారం.. ఫాస్ట్‌ట్యాగ్ ప్రధాన చెల్లింపు విధానంగా మారుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ అనేది.. వాహనాల ముందుభాగంలో అమర్చే ఒక ఎలక్ట్రానిక్ ట్యాగ్, ఇది టోల్ ప్లాజా వద్ద స్కాన్ చేయబడుతూ ఆటోమేటిక్‌గా డబ్బు కట్ అవుతుంది. దీనివల్ల వాహనాలు ఆగకుండా సులభంగా ముందుకు వెళ్లగలుగుతాయి.

అయితే.. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనదారులకు కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది. వారు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. కానీ ఇలా టోల్ ఫీజు చెల్లించేవారు సాధారణ టోల్ ఫీజుకంటే కూడా 25 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి తరచుగా హైవేలో ప్రయాణించే వారికి ఫాస్ట్‌ట్యాగ్ వాడటం ఆర్థికంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement