భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఇదే..!

Nitro Phone 1 Price GUTTED Google Pixel 4a Is The Safest Android Phone On Earth - Sakshi

స్మార్ట్‌ఫోన్స్‌లో అత్యంత సురక్షితమైనా ఫోన్‌ ఏది అంటే ఠక్కున చెప్పే పేరు..ఆపిల్‌ ఐఫోన్‌ లేదా గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్స్‌ అని చెప్పేస్తాము. ఐఫోన్లకు, గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లకు ఆదరణ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే ఈ రెండు ఫోన్లకు సాటి లేదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్‌ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. కొద్దిరోజుల క్రితం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌తో ఐఫోన్లను కూడా హ్యాకింగ్‌ చేస్తూన్నారనే వార్తలు కూడా వచ్చాయి. అప్పట్లో తమ వినియోగదారులకోసం ఆపిల్‌ ఐవోఎస్‌ను మార్చుకోండి అని సూచించింది.
చదవండి: Apple : సెప్టెంబర్‌ 14నే ఐఫోన్‌-13 రిలీజ్‌..! కారణం​ అదేనా..!

భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఇదే..!
ఒకానొక సందర్భంలో ఐఫోన్లు కూడా హ్యాకింగ్‌ గురైతుందనే వార్తలు కొంత విస్మయాన్ని గురిచేశాయి. అసలు ప్రైవసీ విషయంలో అత్యంత సురక్షితమైన స్మార్ట్‌ఫోన్స్‌ లేవనుకుంటే మీరు పొరపడినట్లే..! జర్మనీకి చెందిన నైట్రోకీ కంపెనీ తయారుచేసిన నైట్రోఫోన్‌ 1 భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్‌గా నిలిచినట్లు 9టూ5 గూగుల్‌ నివేదించింది.

 ప్రైవసీపై ఎక్కు వ దృష్టిసారించి  నైట్రోఫోన్‌ 1 ను తయారుచేశారు. ఈ ఫోన్‌ తయారుచేయడం కోసం గూగుల్‌ పిక్సెల్‌ 4ఏలోని హర్డ్‌వేర్‌ పార్ట్‌ను తీసివేసి ఇతర హర్డ్‌వేర్‌తో రిప్లేస్‌ చేశారు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు బదులు గ్రాఫ్రేనియన్‌ఓఎస్‌తో నడుస్తోంది. నైట్రోకీ కంపెనీ హర్డ్‌వేర్‌ సెక్యూరిటీకీలను, ల్యాప్‌టాప్‌లను, పర్సనల్‌ కంప్యూటర్లను జర్మనీలో విక్రయిస్తుంది. 

నైట్రోఫోన్‌ 1 స్పెషాలిటీలు
నైట్రోఫోన్‌ 1లో గూగుల్‌కు సంబంధించిన యాప్స్‌ రావు, ఈ ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌, గూగుల్‌ ఫోటోస్‌ వంటి యాప్స్‌కు యాక్సెస్‌ ఉండదు. ఆన్‌లైన్‌లో సురక్షితమైన బ్రౌజింగ్‌ కోసం అత్యంత శక్తివంతమైన వెర్షన్‌ క్రోమియం బ్రౌజర్‌తో నడుస్తోంది. ఆండ్రాయిడ్ కెర్నల్, వెబ్‌వ్యూ, కంపైలర్ టూల్‌చైన్, ఫైల్ సిస్టమ్ యాక్సెస్ వంటివి అత్యంత బలమైన వెర్షన్‌ సహయంతో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ప్రైవసీని మెరుగుపరచడానికి ఇంటర్‌ఫేస్ మెరుగుదల కోసం ఆటోమేటెడ్ షట్‌డౌన్‌లు వస్తూంటాయి. మీ IMEI నంబర్, MAC చిరునామాను ఇతరుల డిటెక్ట్‌ చేయకుండా మాస్క్‌ చేస్తోంది. నైట్రోఫోన్‌ 1 ధర 630 యూరోలు(సుమారు రూ. 54,629).

చదవండి: Tinder User Creates A Contract: బాయ్‌ఫ్రెండ్‌గా కొనసాగాలంటే..బాండ్‌ మీద సంతకం చేయాల్సిందే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top