మింత్రా సీఈఓ రాజీనామా! | Myntra CEO Nandita Sinha to Leave | Sakshi
Sakshi News home page

మింత్రా సీఈఓ రాజీనామా!

Apr 5 2026 3:35 PM | Updated on Apr 5 2026 4:13 PM

Myntra CEO Nandita Sinha to Leave

ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్ 'మింత్రా' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నందితా సిన్హా రాజీనామా చేయనున్నారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించేందుకు కంపెనీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో ఒక అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

దాదాపు 13 సంవత్సరాల క్రితం ఫ్లిప్‌కార్ట్ గ్రూపులో అసోసియేట్ డైరెక్టర్‌గా చేరిన నందితా సిన్హా.. ఆ తరువాత కాలంలో ఫర్నీచర్, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, హెల్త్ అండ్ బ్యూటీ వంటి టీమ్స్‌లో పనిచేశారు. మీషోను 2014లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసిన తరువాత.. 2022లో నందితా దానికి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈమె రాజీనామా చేయడానికి కారణం ఏమిటనే విషయం వెల్లడికాలేదు.

ఫ్లిప్‌కార్ట్ కంపెనీ ఐపీఓకు వెళ్లడానికి ముందే తన పదవి నుంచి నందితా సిన్హా వైదొలగనున్నారు. తరువాత.. షారన్ పైస్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎవరీ షారన్ పైస్?
షారన్ పైస్ గతంలో మింత్రాలో లీడర్‌షిప్ బాధ్యతలు చేపట్టారు. దదాపు నాలుగు సంవత్సరాలు కంపెనీలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా పనిచేశారు. అంతే కాకుండా గత ఏడేళ్ల కాలంలో ఆయన సంస్థలో వివిధ పదవులలో కొనసాగారు. కంపెనీలో చేరడానికి కంటే ముందు.. అంటే 2014లో ప్రాక్టర్, గాంబుల్‌లో మేనేజర్ పదవుల్లో పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement