Covid-19 : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్‌..సొంతిల్లే కొనుక్కుంటాం' | Sakshi
Sakshi News home page

Covid-19 : 'అద్దె ఇంట్లో ఉండలేం బాబోయ్‌..సొంతిల్లే కొనుక్కుంటాం'

Published Thu, Jun 3 2021 5:24 PM

Most Of The People Showing Interest Decided On Buying Their Own Home - Sakshi

క‌రోనాకి ముందు సొంత ఇళ్ల‌ను కొనుగోలు చేసే సాహ‌సం చేయ‌లేదు.కానీ ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు యువతరం మునుపెన్నడూ లేనంతగా సొంత ఇంటి కొనుగోలువైపు మొగ్గుచూపుతున్నారు.  సొంత ఇల్లు కొనే స్థోమ‌త లేక అద్దె ఇంట్లో కాలం వెళ్ల‌దీస్తున్న చాలామంది సొంతంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు  ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరోక్ వెల్ల‌డించింది. ఆ సంస్థ విడుద‌ల చేసిన నివేదిక ఆధారంగా..  2018 కంటే  2019 మొదటి మూడు త్రైమాసికాలలో 7న‌గ‌రాల్లో దాదాపు 2.02ల‌క్షల యూనిట్ల ఇళ్లు అమ్మ‌కాలు జ‌రిగి, దీంతో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి.  2016 లో ఇది 2.07ల‌క్ష‌ల యూనిట్లుగా ఉంద‌ని అన‌రోక్ తన నివేదిక‌లో పేర్కొంది.  

క‌రోనా కార‌ణంగా అన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. కానీ అనూహ్యంగా రియ‌ల్ ఎస్టేట్ రంగం నెలల్లోనే పుంజుకుంద‌ని, మొద‌టి  అన్ లాక్ చేసిన కొద్ది నెల‌ల్లోనే అమ్మకాలు సాధార‌ణ స్థాయికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హ‌మ్మారి విజృంభించినా  2020 సెప్టెంబరులో భారత గృహనిర్మాణ రంగం   65%  నుంచి 79% వరకు పుంజుకుంద‌ని అన‌రోక్ ప్ర‌తినిధులు వెల్లడించారు. "కరోనావైరస్ మహమ్మారి అమ్మకాలు కేవలం 12,730 యూనిట్లకు త‌గ్గింద‌ని, అయితే ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా పెరిగాయ‌ని తెలిపింది.  

క‌రోనా కార‌ణంగా అద్దె ఇంట్లో నివ‌సించేవారు అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నార‌ని, దీంతో అద్దె ఇల్లు కంటే సొంత ఇల్లే మంచిద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చినట్లు అన‌రోక్  నివేదిక‌లో తేల్చింది. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే మ‌హ‌మ్మారి దేశాన్ని వ‌ణికిస్తున్నా పెద్ద ఇళ్లకు, 3 బీహెచ్ కే ఇళ్ల‌కు భారీగా డిమాండ్ పెరిగింది.  క‌రోనా వల్ల ఎక్కువ మందికి ఇండ్ల‌కే ప‌రిమితం అవుతున్నారు. ఆఫీస్ వ‌ర్క్‌, లేదంటే కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డ‌ప‌డం, వ్యాయామాలు ఇలా ఇత‌రాత్ర కార‌ణాల వ‌ల్ల పెద్ద ఇళ్ల‌ను కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో ప్రాప‌ర్టీ సంస్థ ప్రాప్‌టైగర్ డేటా ల్యాబ్స్ ప్రకారం.. 2020 మొద‌టి త్రైమాసికంలో  3 బీహెచ్ కే  కేటగిరీలోని 15,998 యూనిట్లు అమ్ముడు కాగా ఆ సంఖ్య కాస్త పెరిగి 2021 మొద‌టి త్రైమాసికంలో 17,200 యూనిట్లకు అమ్ముడైన‌ట్లు ప్రాప్ టైగ‌ర్ డేటా ల్యాబ్స్ నివేదిక‌లో తేలింది.  

చ‌ద‌వండి : రియల్టీ @ లక్ష కోట్ల డాలర్లు

Advertisement
Advertisement