మోదీ గిఫ్ట్‌.. 'మెలొడీ' పెంపునకు సిద్ధం! | Modi Melody Gift to Meloni Sparks Massive Demand for Toffees | Sakshi
Sakshi News home page

మోదీ గిఫ్ట్‌.. 'మెలొడీ' ఉత్పత్తి పెంపునకు సిద్ధం!

May 22 2026 4:29 PM | Updated on May 22 2026 6:09 PM

Modi Melody Gift to Meloni Sparks Massive Demand for Toffees

ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి ప్రధాని నరేంద్ర మోదీ ’మెలొడీ’ టాఫీలను బహుకరించడం వైరల్‌ కావడంతో వాటికి డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. దీనితో ఉత్పత్తిని కూడా పెంచుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లే ప్రోడక్ట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ షా తెలిపారు. బ్రాండ్‌ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రచార కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.

స్వదేశీ బ్రాండ్‌ వృద్ధి చెందేందుకు మోదీ ఒక చక్కని అవకాశం కల్పించారన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా మెలొడీని మరింత ప్రాచుర్యంలోకి తేవడంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మెలొడీ ప్రస్తుతం దాదాపు 100 దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపిణీదారుల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ బట్టి చూస్తుంటే మెలొడీకి వినియోగదారుల్లో డిమాండ్‌ అనూహ్య స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement