నిలిచిపోనున్న మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలు

Microsoft Teams Will stop Working for Millions of People from Today - Sakshi

అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నిలిచిపోనుంది. ఈ రోజు(నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్లో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్కి సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఒక వేల మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్ లో టీమ్స్ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్ లో వినియోగదారులందరని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. (చదవండి: మోటో జీ 5జీ లాంచ్ నేడే)

2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను మైక్రో సాఫ్ట్ కొత్తగా తీసుకొచ్చింది. క్రోమ్ బ్రౌజర్ మాదిరిగానే ఇది కూడా సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తుందని తెలిపింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 25 సంవత్సరాల క్రితం, 1995 ఆగస్టులో విడుదలైంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్. 2003 ఏడాదిలో 95 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి వాటితో పోటీ నేపథ్యంలో ఈ కొత్త వెబ్ బ్రౌజర్ ని తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top