MG Gloster: కొత్త ఎడిషన్‌లో విడుదలైన ఎంజీ గ్లోస్టర్ - అదిరిపోయే లుక్ & అంతకు మించిన ఫీచర్స్!

Mg gloster blackstorm edition india launched price design and features - Sakshi

MG Gloster Blackstorm edition: భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజీ మోటార్' కంపెనీ ఎట్టకేలకు గ్లోస్టర్ ఎస్‌యువి కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు 'బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్'. ఈ ప్రీమియం కారు ధరలు, అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' ధర రూ. 40.30 లక్షలు. ఇప్పటికే ప్రీమియం విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న గ్లోస్టర్ ఇప్పుడు మరింత అద్భుతంగా తయారైంది. ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

డిజైన్
ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ బయట, లోపలి భాగంలో ఎక్కువ భాగం బ్లాక్ థీమ్‌ పొందుతుంది. ఇది రెండు పెయింట్ ఆప్షన్‌లతో మెటల్ బ్లాక్ అండ్ మెటల్ యాష్‌తో పాటు రూప్ రైల్స్, టెయిల్‌ల్యాంప్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్, విండో చుట్టూ ఉండే ట్రిమ్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్‌స్టార్మ్ ట్రీట్‌మెంట్‌ పొందుతుంది. అంతే కాకుండా బయట వైపు రెడ్ కలర్ యాక్సెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది హెడ్‌ల్యాంప్స్, బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, వింగ్ మిర్రర్‌లపై చూడవచ్చు. పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

ఫీచర్స్
ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగం బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్‌మెంట్ పొందుతుంది. ఇది ఇంటీరియర్ అపోల్స్ట్రే, స్ట్రీరింగ్, డ్యాష్‌బోర్డ్‌లలో కనిపిస్తుంది. గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ 6 అండ్ 7-సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దాదాపు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.

(ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్‌యువి700 సన్‌రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!)

ఇంజిన్ & పర్ఫామెన్స్
ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఇంజిన్, పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు పొందలేదు. 2WD వెర్షన్ 163 hp ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ సింగిల్ టర్బో-డీజిల్ ఇంజన్‌.. 4WD వెర్షన్ 218 hp పవర్ అందించే 2.0-లీటర్ ట్విన్ టర్బో-డీజిల్ ఇంజన్‌ పొందుతాయి. రెండు ఇంజిన్స్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top