సింగిల్ ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణం! 

MG Cyberster EV teased ahead of unveil on March 31 - Sakshi

ఎంజీ మోటార్స్ మార్చి 31న విడుదల కాబోయే సంస్థకు చెందిన ఎంజీ సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుకు సంబందించిన కొన్ని చిత్రాలను బయటకి విడుదల చేసింది. విడుదలైన చిత్రాల ప్రకారం చూడటానికి హై ఎండ్ మోడల్ స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తుంది. ఈ కారులో చాలా ఫీచర్లు అన్నిటికంటే భిన్నంగా ఉన్నాయి. ముందుకు వంగి ఉన్న లిప్ స్పాయిలర్ల మధ్య ఎంజి లోగో ఇవ్వబడింది. ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా గేమింగ్ కాక్‌పిట్‌తో వచ్చిన తోలి ఎలక్ట్రిక్ కారు ఇదే. దీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 800 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఎంజీ సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కేవలం 3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. వినియోగదారులకు వాహనంలో 5జీ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. ఎంజీ సైబర్‌స్టర్ వెనుక డిజైన్ ‘‘కాంబాక్’’ స్టైలింగ్‌ను కలిగి ఉంది. సైబర్‌స్టర్‌లో మ్యాజిక్ ఐ ఇంటరాక్టివ్ హెడ్‌లైట్లు ఇవ్వబడ్డాయి. కారు వైపు లేజర్ బెల్ట్ ఎల్ఈడి స్ట్రిప్ ఉంది. ఎంజీ మోటార్స్ యువతను దృష్టిలో పెట్టుకొని దీనిని తీసుకొస్తున్నట్లు అర్ధం అవుతుంది.

చదవండి:

డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top