కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మారుతీ సుజుకీ టార్గెట్! | Maruti Suzuki 8000 Service Touchpoints At 2030 31 | Sakshi
Sakshi News home page

కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మారుతీ సుజుకీ టార్గెట్!

Apr 5 2026 2:57 PM | Updated on Apr 5 2026 3:47 PM

Maruti Suzuki 8000 Service Touchpoints At 2030 31

కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ సర్వీస్ నెట్‌వర్క్‌ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 502 సర్వీస్ టచ్‌పాయింట్స్‌ని ఏర్పాటు చేసింది. ఇవి ఎరీనా, నెక్సా వర్క్‌షాప్స్, మారుతీ సుజుకీ సేల్స్‌ అండ్‌ సర్వీస్ పాయింట్స్, సర్వీస్–ఆన్‌–వీల్స్, బాడీషాప్‌–ఆన్‌–వీల్స్‌ ఫార్మాట్లలో ఉన్నాయి.

ప్రస్తుతం 5,926గా ఉన్న టచ్‌పాయింట్స్‌ని 2030–31 ఆర్థిక సంవత్సరం నాటికి 8,000కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ ఎండీ హిసాషి టకెయుచి తెలిపారు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే తమకు అవసరమైనప్పుడు స్పేర్‌ పార్ట్స్, సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయనేది కస్టమర్లకు ఒక భరోసాకల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే తమ నెట్‌వర్క్‌ని తీర్చిదిద్దుకుంటున్నట్లు వివరించారు.

ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని కొత్త తయారీ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల యూనిట్లకు పెంచుకునేందుకు రూ. 10,189 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ గత నెలలో వెల్లడించింది. 2030–31 నాటికి 40 లక్షల వార్షికోత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement