రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్ | Mark Zuckerberg Net Worth Up Rs 4 48 lakh Crore in 2024 | Sakshi
Sakshi News home page

రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్

Published Sun, Sep 8 2024 7:42 AM | Last Updated on Sun, Sep 8 2024 11:22 AM

Mark Zuckerberg Net Worth Up Rs 4 48 lakh Crore in 2024

ప్రపంచ కుబేరుడు ఎవరు అనగానే వినిపించే పేరు టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk). అయితే ఈ ఏడాది అత్యధికంగా సంపాదించినవారి జాబితాలో మాత్రం మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' స్థానం సంపాదించుకున్నారు.

2024లో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 54 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 4.48 లక్షల కోట్లు. ఈ ఒక్క సంవత్సరమే ఈయన సంపద 40 శాతం పెరిగి 182 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో జుకర్‌బర్గ్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నారు. మెటా సీఈఓ కంటే 7 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపాదనతో 'బెర్నార్డ్' మూడో స్థానంలో నిలిచారు.

2024 ప్రారంభంలో ఎన్వీడియా కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జెన్సన్ హువాంగ్' షేర్స్ కూడా గత రెండు రోజులుగా భారీగా తగ్గాయి. దీంతో ఈయన ఏకంగా 11.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. సంవత్సర ఆదాయం పరంగా హువాంగ్ 44 బిలియన్ డాలర్ల లాభాలను పొందారు. దీంతో ఈయన నికర విలువ 93 బిలియన్ డాలర్లకు పెరిగింది.

ఇదీ చదవండి: ప్రపంచంలో రెండో స్థానానికి భారత్‌    

జుకర్‌బర్గ్ నాయకత్వంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌లో భారీ పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులు ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురి చేసింది. దీంతో 2021 సెప్టెంబర్ - 2022 నవంబర్ మధ్య మెటా స్టాక్ 75 శాతం కంపెనీ ఎక్కువ తగ్గిపోయింది.

ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుండటంతో ఇన్వెస్టర్లకు కంపెనీ మీద విశ్వాసం ఏర్పడింది. ఫలితంగా మెటా షేర్లు మళ్ళీ రికార్డు స్థాయికి చేరాయి. దీంతో కంపెనీ విలువ ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మెటాలో జుకర్‌బర్గ్ వాటా 13 శాతానికి చేరింది. 2022లో 35 బిలియన్ డాలర్ల సంపద మాత్రమే కలిగి ఉన్న జుకర్‌బర్గ్.. ఇప్పుడు 182 బిలియన్ డాలర్ల నికర విలువకు చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement