పెరిగిన మహీంద్రా కార్ల ధరలు | Mahindra to Hike Prices by Up To 2 5 Percent | Sakshi
Sakshi News home page

పెరిగిన మహీంద్రా కార్ల ధరలు

Apr 3 2026 7:41 PM | Updated on Apr 4 2026 8:49 AM

Mahindra to Hike Prices by Up To 2 5 Percent

దేశీయ వాహన తయారీ దిగ్గజం.. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ వెల్లడించింది. ధరలు గరిష్టంగా 2.5 శాతం వరకు పెరగనుండగా, అన్ని వాహనాలపై సగటున 1.6 శాతం పెరుగుదల ఉంటుంది.

పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, మొత్తం వ్యయాల మొదలైన కారణాల వల్లనే ధరల పెంపు జరిగిందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది. దీంతో XUV 3ఎక్స్ఓ ఈవీ, ఎక్స్ఈవీ 9ఎస్, బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెరగనున్నాయి. కొత్త ధరలో త్వరలోనే వెల్లడవుతాయి. థార్, స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ వంటి జనాదరణ పొందిన మోడళ్ల ధరలు 2.5% వరకు పెరగనున్నాయి.

మహీంద్రా XUV7XO ధరల సవరణ మొదటి 40,000 బుకింగ్‌ల డెలివరీ తర్వాత జరుగుతుంది. ధరల పెరుగుదల జరిగినప్పటికీ.. కారు ఫీచర్లు లేదా మెకానికల్ స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవు.

Advertisement
 
Advertisement
Advertisement