
మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. కంపెనీ బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ కార్లు ఐదు నెలల్లోనే 20,000 యూనిట్ల అమ్మకాలను సాధించాయి.
భారతీయ విఫణిలో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉండటంతో.. కంపెనీ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది.సంస్థ జనవరి, జూన్ 2025 మధ్య 19,915 యూనిట్లను తయారు చేసి, డీలర్లకు 19,070 యూనిట్లను సరఫరా చేసింది. ఇప్పుడు ఉత్పత్తిని 8,000 యూనిట్లు పెంచింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది.
మొత్తం బుకింగ్‌లలో XEV 9e వాటా 59 శాతంతో అగ్రస్థానంలో ఉంది. బీఈ 6 సేల్స్ 6.41 శాతం ఉన్నాయి. రెండు SUVలు ప్రీమియం "ప్యాక్ త్రీ" వేరియంట్‌లకు బలమైన ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇది హై-ఎండ్ ఫీచర్లకు డిమాండ్‌ను హైలైట్ చేస్తుంది. నెలవారీ అమ్మకాల వృద్ధి బలంగా ఉంది.