ఎల్‌ఐసీ ఇక రియ‍ల్టీపై ఫోకస్‌ | lic realty focus subsidiary plan higher returns rs 60000 crore assets | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఇక రియ‍ల్టీపై ఫోకస్‌

May 30 2026 1:09 PM | Updated on May 30 2026 1:14 PM

lic realty focus subsidiary plan higher returns rs 60000 crore assets

న్యూఢిల్లీ: రియల్టీ ఆస్తుల నుంచి మెరుగైన రిటర్నులను సాధించాలని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ చూస్తోంది. ఇందుకుగాను విడిగా అనుబంధ సంస్థ ఏర్పాటు అవకాశాలను అన్వేషిస్తోంది. భారీగా ఉన్న ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా తాజా ప్రణాళికలకు తెరతీయనుంది. కంపెనీ ఆస్తుల కనీస విలువ రూ. 60,000 కోట్లుగా అంచనా వేసింది.

కార్యకలాపాల నిర్వహణలో భాగంగా గత 7 దశాబ్దాలుగా రియల్టీ ఆస్తులను సమకూర్చుకుంటున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ ఆర్‌.దొరైస్వామి పేర్కొన్నారు. వెల్లడించారు. సొంత వినియోగంతోపాటు రిటర్నులకు వీలున్న పెట్టుబడి వ్యూహాలతోనూ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల కంపెనీ మొత్తం రియల్టీ పోర్ట్‌ఫోలియోపై పూర్తిస్థాయిలో సమీక్ష చేపట్టినట్లు తెలియజేశారు.

తద్వారా కంపెనీకి లభిస్తున్న రిటర్నులు, ఆర్జన(ఈల్డ్స్‌)ను సమీక్షించడంతోపాటు.. మరింత మెరుగైన రిటర్నులకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు వివరించారు. అటు పాలసీదారుల రిటర్నులను పెంచడంతోపాటు.. ఇటు సంస్థ లాభదాయకతను మెరుగుపరిచే లక్ష్యం పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నట్లు 
పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement