ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కడ ఎక్కువంటే.. | Knight Frank Beyond Bricks The Pulse of Home Buying | Sakshi
Sakshi News home page

ఇళ్ల కొనుగోళ్లపై ఆసక్తి ఎక్కడ ఎక్కువంటే..

May 29 2025 12:13 PM | Updated on May 29 2025 1:07 PM

Knight Frank Beyond Bricks The Pulse of Home Buying

దేశవ్యాప్తంగా ఆస్తుల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇటీవల సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్-ది పల్స్ ఆఫ్ హోమ్ బైయింగ్’ సర్వేలో భాగంగా దేశంలో ఇళ్ల కొనుగోలుపై విభిన్న వర్గాల ప్రజల ఆసక్తులు ఎలా ఉన్నాయో తెలియజేసింది. చెన్నై (86 శాతం), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (85 శాతం), అహ్మదాబాద్ (83 శాతం) ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సర్వేలో పేర్కొంది.

సర్వేలోని వివరాల ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని గృహ కొనుగోలుదారులు నిర్మాణంలో ఉన్న ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.  బెంగళూరులో ఆ ఆస్తుల పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అంశాల్లో ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాల అందుబాటుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ అంశంలో హైదరాబాద్ (81 శాతం), కోల్‌కతా (80 శాతం) దీర్ఘకాలిక భద్రతా కారణాల దృష్ట్యా బలమైన కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామం

దేశంలోని టాప్ 8 టైర్-1 నగరాల్లోని 1,629 మంది పట్టణ గృహ కొనుగోలుదారుల నుంచి వివరాలు సేకరించి ఈమేరకు నివేదిక రూపొందించారు. ఈ సర్వేలో మిలీనియల్స్, అధిక ఆదాయ వ్యక్తులు అత్యంత చురుకైన కొనుగోలుదారులుగా ఉన్నారని తేలింది. నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. కొవిడ్‌19 అనంతర కాలంలో నివాస డిమాండ్ గణనీయంగా పెరిగిందని అన్నారు. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు, స్టాంప్ డ్యూటీ రిబేట్లు వంటివి కొనుగోలుదారులకు కలిసి వస్తున్నాయని తెలిపారు. మారుతున్న జీవనశైలి, యువ కొనుగోలుదారుల్లో పెరిగిన ఆర్థిక సామర్థ్యం భారత రెసిడెన్షియల్ మార్కెట్‌ను పెంచుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement