పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ఎఫెక్ట్‌: చమురు ధరలు తగ్గనున్నాయా?!

As Of July 20, 2021, Petrol And Diesel Prices Did Not Increase - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ :  దేశంలో చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 3 నుంచి నేటి మధ్య కాలంలో వరుసగా 4 రోజుల పాటు పెట్రో ధరలు పెరగకపోవడం గమనార్హం. అయితే అందుకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగడం ఓ కారణమేనని మార్కెట్‌ పండితులు అభిప్రాయం  వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం రోజు పెట్రోల్‌ ధరల వివరాలు    

  • ముంబై లీటర్‌ పెట్రోల్‌ ధర రూ .107.83 ఉండగా డీజిల్ ధర రూ .97.45గా ఉంది
  • ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ .101.84 ఉండగా డీజిల్ ధర రూ .89.87గా ఉంది
  • చెన్నైలో పెట్రోల్‌ ధర రూ102.49 ఉండగా డీజిల్ రూ .94.39 గా ఉంది
  • కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ .102.08 ఉండగా డీజిల్ రూ .93.02 గా ఉంది
  • హైదరాబాద్‌ లో పెట్రోల్‌ ధర రూ .105. 83 ఉండగా డీజిల్ రూ .97.96గా ఉంది
  •  బెంగళూరు లో పెట్రోల్‌ ధర రూ .105.25 ఉండగా డీజిల్ రూ .95.26గా ఉంది

మరో వైపు త్వరలో చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 18 న జరిగిన ఒపెక్ (పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య) సమావేశంలో పెట్రోలు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు.కరోనా ఎఫెక్ట్‌తో తగ్గించిన పెట్రోలు నెల వారి ఉత్పత్తి సామార్థ్యాన్ని తిరిగి రోజుకు 400,000 బారెల్స్ పెంచాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. ఈ ప్రకటన తర్వాత ముడి ధరలు బాగా పడిపోయాయి. జులై 16న బ్యారెల్‌ ధర 73.59 డాలర్లు ఉండగా... జులై 19న ధర 68.62డాలర్లుగా ఉంది. ముడి చమురు ఉత్పత్తి పెరుగుతూ పోతే దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top